The Indian Premier League auction for the 12th edition, scheduled to be held in Jaipur in December, will get a prime time viewership. The auction usually starts in the morning and ends around 5 pm but that’s all set to change this year with a 3 pm start.
#ipl2019auction
#indvsaustest
#bcci
#primetimeviewership
ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం టైమ్‌ను బీసీసీఐ మార్చింది. వేలానికి కూడా మంచి వ్యూవర్‌షిప్, ఆదాయం తీసుకురావాలన్న ఉద్దేశంతో ఐపీఎల్ సీజన్ 12 వేలం సమయాన్ని మార్చినట్లు బోర్డు వెల్లడించింది. మామూలుగా వేలం ఎప్పుడు జరిగినా ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యేది. అయితే ఈసారి మాత్రం అది మధ్యాహ్నం 3 గంటల నుంచి మొదలవుతుంది. దీనివల్ల ప్రైమ్‌టైమ్ వ్యూవర్‌షిప్‌ను బీసీసీఐ లక్ష్యంగా చేసుకుంది. డిసెంబర్ 18న జరిగే ఈ వేలం మధ్యాహ్నం 3 గంటలకు మొదలై రాత్రి 9.30 గంటలకు ముగుస్తోంది. ఈసారి వేలం జైపూర్‌లో జరగనుంది. వేలం తేదీని కూడా బోర్డు వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది. డిసెంబర్ 18 ఇండియా, ఆస్ట్రేలియా రెండో టెస్ట్ చివరి రోజు. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు ప్లేయర్స్ బదిలీల ప్రక్రియను పూర్తి చేశాయి. ప్రతి టీమ్ తమకు అందుబాటులో ఉన్న మొత్తంతో అవసరమైన ప్లేయర్స్‌ను వేలంలో కొనుగోలు చేయనున్నాయి.